24 గంటల్లో నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు

నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు ఈ మూడు కారణాలు ఒక పెద్ద సమస్య. ఈ మూడు కారణాల వల్ల ప్రతి దేశం ఆర్దికంగా ఎంతో నష్టపోతుంది. అందుకే ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో అభివృద్ది కనబడలేదు. అందుకే మేము మూడు విధానాలను ఆలోచించాము.

ఒకటొవ విధానం ఆలోచన :- ప్రపంచం మొత్తం మీద ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బుని దాచుకొనుటకు వీలు కల్పించాలి. బ్యాంక్ నుండి డబ్బు తీసుకోవడానికి ఎన్ని బ్యాంకుల ద్వారానైనా వీలు కల్పించాలి.
ఉదా :- ఒక పౌరుడికి ప్రపంచం మొత్తం మీద ఎస్.బి.ఐ, ఐ.సి.ఐ.సి.ఐ, హెచ్.డి.ఎఫ్.సి., ఆక్సిస్ బ్యాంకు... ఇలా మొదలగు బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా కలిగి వుంటే, ఈ విధానాన్ని రద్ధు చేసి, ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఒక పౌరుడికి  ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఈ నూతన విధానం వలన నల్లధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు.

రెండవ విదానం :- ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రజల ఆస్తులను నూతన చట్టాలద్వారా సర్వే చేయాలి.
ప్రపంచంలో చాల మంది బినామీల పేరుతో వైట్ మనీ ని సాగు భూముల మీద పెట్టుబడులు పెట్టుచున్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రజల ఆస్తులను సర్వే చేయాలి.
ఎందుకంటే ఒక గ్రామంలోని మొత్తం 100 ఎకరాలు ఉంటే అందులో
 20 ఎకరాలు ప్రభుత్వానిది
 40 ఎకరాలు యజమానులు ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలది అయితే 
 40 ఎకరాలకు మిగిలిన యజమానులు ఎక్కడ వున్నారు? వాటి వివరాలు ఆదాయ శాఖకు తెలియపరుచుటవలన మిగిలిన 40 ఎకరాల యజమానులు ఏ దేశం వారు? ఏ రాష్ట్రం వారు? ఏ జిల్లా వారు? ఏ ప్రాంతం వారు? అనేది తెలుసుకోవటానికి ప్రభుత్వానికి మరియు ఆదాయ శాఖకు సులభం అవుతుంది. ఈ విధానం వలన ఆ గ్రామంలో మిగిలిన 40 ఎకరాల భూమి ఎవరిది అయితే వారి వివరాలను తెలుసుకోవడానికి  ప్రభుత్వ ఆదాయ శాఖ గడువుతో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. గడువు తేదేలోగా ఎవరు హక్కుదారులు రాకపోతే ఆమిగిలిన భూమి ఆ గ్రామానికే ఉపయెగించుకోవడానికి ప్రభుత్వం అనుమతితో వీలు కలుగుతుంది. ఇదే విదంగా ఆ గ్రామంలో ఇళ్ళు, కంపెనీలు, వ్యాపారాలు ఇలా ఏవైనా కావచ్చు. వాటిని ప్రతి సంవత్సరం సర్వే చెయ్యాలి. ప్రతీ గ్రామం, ప్రతీ మండలం, ప్రతీ జిల్లా యొక్క లావాదేవీలు ఆదాయశాఖకు తెలియపరచాలి. లేనిచో పైన తెలిపిన విదంగా ప్రభుత్వం గడువుతో కూడిన ఉత్తర్వులతో సొంతం చేసుకోవాలి.

మూడవ విదానం : - ప్రపంచంలో నివశించు ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా సంవత్సరానికి ఒక్కసారి వారి ఆస్తుల లావాదేవీలు ఆదాయశాఖకు తెలియపరుచుట వలన నల్ల ధనం, అవినీతి సొమ్ము మరియు దొంగ నోట్లు అరికట్టవచ్చు.

ప్రపంచం మొత్తం మీద ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి.

ప్రతి గ్రామంలో మరియు వార్డులలో బ్యాంకులను ఏర్పాటు చెయ్యాలి. ఈ బ్యాంకులు ద్వారా ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి ఒక్క ఎకౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఈ ఎకౌంట్ ద్వారానే ప్రతి ఒక్క పౌరుడు తన యెక్క ఆర్దిక లావాదేవీలు జరుగుతాయి. ఒక వ్యక్తికి ఎన్ని వ్యాపార సంస్దలు ఉన్నా, ఈ ఒక్క బ్యాంక్ ఎకౌంట్ ద్వారా మాత్రమే వాటి లావాదేవీలు జరుగుతాయి. ఈ బ్యాంకు ఎకౌంట్ నెంబరు ద్వారనే వారి యెక్క సొమ్మును దాచుకొనుటకు వీలు కలుగుతుంది. ప్రపంచంలో మరెక్కడ వీరికి రెండవ బ్యాంక్ ఎకౌంట్ ఇవ్వడం జరగదు.

ఈవిదానం వలన ప్రపంచంలో బ్లాక్ మనీ, కరప్షన్ మనీ, ఫేక్ మనీని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు దేశ సంపదను ఏ ఒక్కరు కూడా తప్పు లెక్కలతో ప్రపంచ దేశాలకు తరలించడానికి అవకాశం ఉండదు. దీని వలన ఏ దేశ ఆర్దిక వ్యవస్ద అయినా ఎప్పటికి కూడా ఒడిదుడుకులను ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచ దేశాలలో లెక్కకు రానీ సొమ్ము అంతయు అతి తక్కువ సమయంలో తెలుసుకోవడానకి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రతీ చిన్న గ్రామానికి ఒక బ్యాంకు ఏర్పాటు చెయ్యాలి. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక బ్యాంకు ఏర్పాటు చెయ్యాలి. ఈ బ్యాంకుల పరిరక్షణ నిరుద్యోగులకు అప్పజెప్పడం మంచిది.

గ్రామాల వారీగా వార్డుల వారీగా చార్టెడ్ ఎకౌంట్స్ ను నియమించాలి. వీరి ద్వారా ఆ గ్రామం యెక్క ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆర్దిక లావాదేవీలు ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి వీలౌతుంది. ఈవిదానం వలన కొంత మంది వ్యాపారస్తులు  గానీ పారశ్రామిక వెత్తలు గానీ ఉద్యోగస్తులు, కార్మికులు మెదలగు వారి లావాదేవీలు ఏమైనా సక్రమంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ గ్రామ పరిది వార్డుల పరిదిలోగల చార్టెడ్ ఎకౌంట్స్ యెక్క లెక్కల ప్రకారమే ప్రతీ పౌరుడి యెక్క ఆర్దిక లావాదేవీలు జరుగుతాయి. ఈ చార్టెడ్ ఎకౌంట్స్ లేక్కల ప్రకారమే ప్రభుత్వానికి ప్రతి పౌరుడి యెక్క లావాదేవీలను తెలుసుకోవడం సులబం అవుతుంది. ఈ విదానం వలన తప్పుడు లెక్కలతో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని గానీ ఇతరులను కానీ మోసం చేసే అవకాశం లేకుండా ఉంటుంది.

By Prasad

Share This